జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలంటే... 1 m ago
మనుషులు ఒకప్పుడు వందేళ్లు బ్రతికేవాళ్లు. కానీ ఇప్పుడు అరవై ఏళ్లు బ్రతకడం కూడా కష్టమే. దానికి కారణం మనిషి జీవనశైలి. ఉదయం ఆఫీసుకు పరిగెత్తడం, చాలీచాలని నిద్రతో మనిషి జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ జీవితంలో కొన్ని కొన్నిమార్పులు తప్పనిసరి చేసుకోవాలి. ఫ్రూట్స్, కూరగాయలు, న్యూట్రిషన్ ఫుడ్స్, చిరుధాన్యం, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, రోజూ తప్పనిసరిగా ఏడు గంటలు నుంచి తొమ్మిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. కుటుంబంతో, స్నేహితులతో సన్నిహితంగా ఉండండి.